అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సినీ రంగంలోకి ‘ధఢక్’ అనే సినిమాతో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా మరాఠి చిత్రం ‘సైరాట్’ కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. జీ స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈమూవీలో హీరోగా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ నటిస్తున్నాడు. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది.
అయితే సినిమా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. ఇందులో శ్రీదేవి కూడా కూతురితో స్క్రీన్ షేర్ చేసుకోనుందట. ఆమె తల్లిగా కనిపించనుందని సమాచారం. ఒరిజినల్ కథలో అయితే హీరోయిన్ తల్లి పాత్ర కొంత సేపే ఉంటుంది. కానీ ధఢఖ్ లో మాత్రం శ్రేదేవి కోసమని స్పెషల్ గా సీన్స్ ని రాసుకుంటున్నాడట దర్శకుడు.
మొత్తానికి కూతురి సినిమాలో తల్లి కూడా కనిపించాలని ఆరాటపడటం కాస్త ఓవర్ గా ఉంది. ధఢఖ్ ని ఒరిజినల్ కథలా కాకుండా కొంచెం కథాంశంలో మార్పులు చేశారట. ఇక కరణ్ జోహార్ కూడా శ్రీదేవిని ఎలాగైనా సినిమాలో ఎక్కువ సేపు ఉండాలని డైరెక్టర్ తో డిస్కస్ చేస్తున్నాడని తెలుస్తోంది.