సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్..

133
Sridevi Soda Centre

పలాస 1978′ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా రూపొందిన తాజా చిత్రం ”శ్రీదేవి సోడా సెంటర్”. ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించింది. రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 27న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్ పొందింది. ఎలాంటి క‌ట్స్ లేవు. సినిమా వ్య‌వ‌ధి 2 గంట‌ల 34 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.

సెన్సార్ పూర్తి కావ‌డంతో ఇక సినిమా విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మైన‌ట్లే. రీసెంట్‌గా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘భలే మంచి రోజు’ తర్వాత ఈ బ్యానర్ లో సుధీర్ బాబు చేస్తున్న రెండో సినిమా ఇది.