సూరిబాబు…మంచోడే కానీ మనోడు కాదు!

67
sudeer

యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఒక్క ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు దర్శకుడు. రివేంజ్ డ్రామాగా ట్రైలర్‌ని తెరకెక్కించిన కరుణ కుమార్..సుధీర్ బాబుతో యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీశాడు.

హీరో జైలు నుంచి బయటకు రావడం, తరువాత హీరోయిన్ తో ప్రేమాయణం, అది వారి ఇంట్లో తెలియడం, ఊర్లో కొంతమంది ప్రమేయంతో హీరోహీరోయిన్ల ప్రేమను విడగొట్టడంతో ఎమోషనల్ యాంగిల్, హీరోను జైలుకు పంపడం, అతను అక్కడి నుంచి వచ్చాక తన ప్రేమను విడదీసిన వారిపై పాగా తీర్చుకోవడం ట్రైలర్ అలా సాగిపోయింది. ఆగస్టు 27న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Sridevi Soda Center Official Trailer | Sudheer Babu | Karuna Kumar | Mani Sharma 70mm Entertainments