వృక్షవేదం..ఎంపీ సంతోష్‌ కృషి అభినందనీయం:విజయేంద్రప్రసాద్

87
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు మరియు పకృతి చిత్రాలు పురాణాలలో పకృతి గురించి చెప్పిన శ్లోకాలతో ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకం వృక్ష వేదం. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌కు అందజేశారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు.

ఈ సందర్భంగా వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ సంతోష్‌ని అభినందించారు విజయేంద్రప్రసాద్. పుస్తకం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న సంతోష్ కృషి అభినందనీయమన్నారు.

భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్. దాదాపుగా 25కి పైగా చిత్రాలకు కథలు అందించిన విజయేంద్రప్రసాద్‌…మోస్ట్ సక్సెస్ ఫుల్ రచయితగా ఇమేజ్ సంపాదించుకున్నారు. బాహుబలి, మెర్సల్,భజరంగీ భాయిజాన్,మణికర్ణిక వంటి చిత్రాలకు కథ అందించారు.