సౌత్ లోకి అతిలోక సుందరి కూతుర్లు

27
- Advertisement -

కొన్ని కలయికలు చాలా క్రేజ్ తో కూడుకుని ఉంటాయి. అలాంటి అరుదైన కాంబినేషనే ‘ఎన్టీఆర్ – జాన్వీ కపూర్’ కలయిక. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కి – శ్రీదేవికి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అందుకే, చాలా కాలంగా జూ.ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తే బాగుంటుంది అంటూ పలువురు సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాన్ని బాహాటంగా వ్యక్త పరిచారు. మొత్తానికి కొరటాల శివ పుణ్యమా అని ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జోడీ కుదిరింది. ‘దేవర’ సినిమా రూపంలో ఈ జోడీకి ఫుల్ గిరాకీ వచ్చింది. అటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే, ఆ మధ్య శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి మీడియం రేంజ్ హీరోలంతా తెగ ట్రై చేశారు. కారణం, ఖుషీ కపూర్ లో గ్లామర్ పాలు తక్కువ. దాంతో ఆమెకు హిందీలో డిమాండ్ లేకుండా పోయింది. సో.. సౌత్ లో ఆమెకు డిమాండ్ ఉంది. కారణం ఖుషీ కపూర్ కూడా శ్రీదేవి కూతురే కాబట్టి. ఈ నేపథ్యంలో ఖుషీ కపూర్ సౌత్ ఎంట్రీ కూడా ఎట్టకేలకు ఎన్టీఆర్ కే దక్కింది. దేవర సీక్వెల్ తో ఖుషి కపూర్ ని టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు తారక్. పైగా సినిమాలో ఖుషీ కపూర్, జాన్వీ కపూర్ కు చెల్లి పాత్రలో కనిపించబోతుంది.

Also Read:MLC Kavitha:BRS అంటే బీసీల సర్కార్

మొదట ఈ పాత్రకు అనన్య పాండేను అనుకున్నారు. అయితే, జాన్వీ కపూర్ రిక్వెస్ట్ చేయడంతో చివరకు ఆమె చెల్లి ఖుషి కపూర్ కు ఈ అవకాశం వెళ్ళింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, శ్రీదేవి చిన్న కూతురు కూడా టాలీవుడ్ కు త్వరలో పరిచయం కాబోతుంది. సినిమాలో తను అనుకున్న పాత్రకు ఖుషీ లుక్స్ మ్యాచ్ అయితే వెంటనే ఆమెను తీసుకుంటాడట కొరటాల. ఈ విషయంలో కొరటాల శివ నిర్ణయానికి జూనియర్ ఎన్టీఆర్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు. మొత్తమ్మీద ఒకే సినిమాతో శ్రీదేవి ఇద్దరు కూతుర్లు సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Also Read:జైల్లో చంద్రబాబు.. ప్లాన్ లో వైసీపీ?

- Advertisement -