రకుల్‌పై రంకు పురాణాలు అంటు శ్రీరెడ్డి కామెంట్స్‌…

238
sri reddy
- Advertisement -

చలన చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో 25 మంది పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటకు రావడం షాకింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి రకుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో ‘టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కాని.. డ్రగ్స్ లాంటివి ఏమీ ఉండవు.. మా ఆర్టిస్టులను ఎందుకు అంటారా’ అంటూ మాట్లాడిందని గుర్తుచేసింది. ఇక మంచు లక్ష్మి అయితే డ్రగ్స్ ఆరోపణలకు నిరసనగా క్యాండిల్స్ వెలిగించి మా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ ఉన్నాయా? మా ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మా ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉందా? అంటూ సిగ్గు లేకుండా క్వశ్చన్ చేశారు అని తెలిపింది.

ఈరోజు డ్రగ్స్ తీసుకున్నట్లుగా రకుల్‌పై వార్తలు వస్తున్నాయి. ఆ రోజు రకుల్ క్యాస్టింగ్ కౌచ్ లేదండీ.. అదండీ.. ఇందండీ.. టాలీవుడ్ సూపర్ అండీ.. డూపర్ అండీ.. డ్రగ్స్ ఏమో తెలియడండీ అంటూ పత్తిత్తు కబుర్లు చెప్పిందని శ్రీరెడ్డి తెలిపింది. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో రకుల్ ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ.. ఆరోజు ఎవరైతే నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెద్ద పత్తిత్తుల్లా బిహేవ్ చేశారో.. ఈరోజు మొత్తం అందరి రంకు పురాణాలు.. చెత్త యవ్వారాలు బయటికొస్తున్నాయని తెలిపింది. నన్ను నిందించిన వాళ్లు ఇప్పుడు పాపం అనుభవిస్తున్నారు. ఈరోజు ఆ కర్మ అనుభవిస్తున్నారు. కర్మ కి ఉన్నోళ్లు లేనోళ్లు అందగత్తెలు అనే బేధం ఉండదు. అందరి తాట… అన్నమాట” అంటూ రకుల్‌పై ఘాటుగా స్పందించింది నటి శ్రీరెడ్డి.

- Advertisement -