తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ పై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరుతో చిత్ర పరిశ్రమలో అమ్మాయిలను వేధిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో పలువురు సినీ ప్రముఖులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు కుమారుడు అభిరామ్, హీరో నాని, శేఖర్ కమ్ముల, కొరటాల శివ వంటి ప్రముఖులపై ఆరోపణలు చేసింది.
దీనిపై స్పందించిన నాని.. శ్రీరెడ్డి తన పరువుకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తుందంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీరెడ్డి సైతం కోర్టులోనే తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరింది. తాజాగా శ్రీరెడ్డి స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ పై కామెంట్స్ చేసింది. హాయ్ తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ జీ.. ఎలా ఉన్నారు? మీ సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చారు కానీ ఇంతవరకు ఏ ఒక్క అవకాశం ఇవ్వలేదని తెలిపింది. మీకు గుర్తుందో లేదో మనం వెలిగొండ శ్రీనివాస్ ద్వారా ఓ హోటల్ లో కలుసుకున్నాం అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టింది.