బిగ్‌బాస్‌ 2లో శ్రీరెడ్డి..!

226
Sri Reddy for Bigg Boss 2..!
- Advertisement -

తెలుగు టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం సృష్టించిన రియాల్టీ షో బిగ్ బాస్ 2. గ‌తేడాది ప్రారంభ‌మైన బిగ్ బాస్ 1 ||షోలో ఎన్టీఆర్ యాంక‌ర్‌గా అద‌ర‌గొట్టాడు. బుల్లితెర‌పై అత్య‌ధిక టీఆర్పీ రేటింగ్స్‌తో ప్రేక్షకాద‌ర‌ణ పొందిన ఈ షో సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు వ‌స్తుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

జూన్ 10 నుంచి ఈ షో ప్రారంభం కానుండ‌గా నాచుర‌ల్ స్టార్ నాని ఈసారి యాంక‌ర్‌గా అల‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే బిగ్ బాస్ 2 ప్ర‌మోష‌న్‌లో టీం బిజీగా ఉండ‌గా 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు అంటూ ఈసారి ఇంకాస్త మసాలా అంటూ నాని చెప్పే డైలాగ్ అంద‌నిలో ఆస‌క్తిని రేపుతోంది.

తొలి సీజ‌న్‌లో శివ‌బాలాజీ విన్న‌ర్‌గా నిల‌వ‌గా ఈసారి ఎవ‌రు బిగ్ హౌస్‌లోకి వ‌స్తారో అన్న ఉత్కంఠ అంద‌రిలో నెల‌కొంది. అయితే టీ టౌన్‌లో మాత్రం ప‌లువురి పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

పవన్‌పై సంచలన ట్వీట్స్‌ చేసిన శ్రీరెడ్డి..

క్యాస్టింగ్ కౌచ్ అంశంతో టాలీవుడ్‌ని షేక్ చేసిన శ్రీ‌రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఇంకాస్త మ‌సాలా ద‌ట్టించు అని నాని చెప్పిన డైలాగ్ శ్రీ‌రెడ్డికి క‌రెక్ట్‌గా సూట‌వుతుంద‌ని…ఆమె బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే ర‌చ్చ ర‌చ్చేనంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై స్టార్ మా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

శ్రీ‌రెడ్డితో పాటు తరుణ్,వరుణ్ సందేశ్,ఆర్యన్ రాజేష్,కమెడియన్ వేణు, హీరో తనీష్ ,ధన్య బాలకృష్ణ, జూనియర్ శ్రీదేవి (ఈశ్వర్ ఫేమ్), తేజస్విని,హీరోయిన్ గజాల, యాంకర్ లాస్య పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

నాకు ఎయిడ్సా ….తాట తీస్తా..!

జూన్ 10 నుంచి ప్ర‌తి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు.. అలాగే సోమ, శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు ఈ కార్య‌క్ర‌మం ప్రసారం కానుంది.

- Advertisement -