మహేష్‌పై మండిపడ్డ శ్రీరెడ్డి..

290
- Advertisement -

టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు – క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అర్ధనగ్న ప్రదర్శన తర్వాత జాతీయ మీడియాలో కూడా శ్రీరెడ్డి పై కథనాలు వచ్చాయి. ఆ తర్వాత `మా` ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి శ్రీరెడ్డి పై నిషేధం ఎత్తి వేస్తున్నామని `క్యాష్`కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అయితే తన డిమాండ్లలో 20 శాతం మాత్రమే `మా` నెరవేర్చిందని తన పోరాటం తన ఒక్కదాని కోసం కాదని శ్రీరెడ్డి చెప్పింది.

Sri Reddy Comments on Kathi Mahesh

భవిష్యత్తులో కూడా యువజన మహిళా సంఘాలతో కలిసి పోరాడుతానని తనను ఇకపై శ్రీ రెడ్డి అని కాకుండా శ్రీ శక్తి అని పిలవాలని తెలిపింది. `మా `ప్రెస్ మీట్ తర్వాత కూడా తన ఫేస్ బుక్ ఖాతాలో కొందరిపై ఆరోపణలు చేసింది. అయితే శ్రీరెడ్డి చెప్పిన వాటిలో `మా` కొన్నింటిపై స్పందించిన తర్వాత కూడా ఆమె ఫొటోల లీక్ లు – ఆరోపణలు ఆపకపోవడం….మీడియాలో రోజుకో ఎపిసోడ్ చొప్పున రిలీజ్ చేయడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

తాజాగా కత్తి మహేష్‌ కూడా ఈ వ్యవహారంలో బయట పడ్డాడు. కత్తి మహేష్ తనను వేధించారని.. తనను గదిలోకి తీసుకెళ్లి.. డోర్ పెట్టి.. బలవంతం చేశారని.. అనంతరం రూ.500 ఇచ్చి పంపించారని శనివారం ఓ ఛానల్‌లో జరిగిన డిబేట్‌లో సునీత అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆరోపించింది. దీనికి సాక్ష్యాధారాలు కూడా చూపిస్తానని సునీత వెల్లడించింది. దీనిపై శ్రీరెడ్డి స్పందించింది. డిబేట్స్‌లో కూర్చుని నీతులు చెప్పడం కాదు కత్తి మహేష్.. ఛీ సిగ్గుండాలి అంటూ విరుచుకు పడింది.

Sri Reddy Comments on Kathi Mahesh

‘‘న్యూస్ ఛానల్స్‌కి వచ్చి డిబేట్స్‌లో కూర్చుని నీతులు చెప్పడం కాదు కత్తి మహేష్.. ఛీ సిగ్గుండాలి. మా ఉద్యమంలో ఆడవారికి అన్యాయం చేసిన వారెవరైనా సరే వారికి శిక్ష పడే వరకూ మేం పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు నువ్వు చేసిన పనికిమాలిన పనికి నువ్వే రివ్యూ చెప్పుకో ఛీ’’ అంటూ ట్విట్టర్ ద్వారా మండి పడింది శ్రీరెడ్డి.

https://twitter.com/ActressSriReddy/status/985212483659902976

- Advertisement -