తప్పు చేశా..క్షమించండి అంటూనే..!

260
sri reddy appoligies pawan mother
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన నటి శ్రీరెడ్డి. తర్వాత శ్రీరెడ్డి లీక్స్ అంటూ కొంతమంది పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఫేస్ బుక్ వేదికగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న శ్రీరెడ్డి బహిరంగ క్షమాపణలు కోరారు.

పవన్ కళ్యాణ్ అమ్మ గారికి నేను మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను నేను కావాలని చేయలేదు కానీ నేను చేసింది ముమ్మాటికి తప్పే అందుకే క్షమించమని కోరుకుంటున్నాను ఫేస్‌ బుక్‌లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. అయితే క్షమాపణలు చెబుతునే పవన్ ఇచ్చిన సూచనలను పాటిస్తానంటూ సినీనటి,సెన్సార్ బోర్డు మెంబర్ జీవితా రాజశేఖర్‌కు కౌంటరిచ్చింది.

మీకు ఏమన్నా సమస్యలు ఉంటే లీగల్‌గా వెళ్ళండి అని పవన్ చెప్పిన విధంగానే నేను చేసే ఈ లీగల్ ఫైట్ జీవిత రాజశేఖర్‌తో మొదలుపెడుతున్నా, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, శ్రీ రెడ్డి లీక్స్ కంటిన్యూ అవుతాయి. మరికొంత మంది బండారం బయటపెడతా అంటూ మరో ట్వీట్ చేశారు శ్రీరెడ్డి.

sri reddy facebookఅంతకముందు మా మాజీ అధ్యక్షుడు నాగబాబు సైతం శ్రీరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టిందని …సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నాగబాబు తెలిపారు. కొంతమంది తప్పుచేస్తే దానికి అందరికి ఆపాదించడం సరికాదన్నారు. ఆడవారితో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే చెప్పుతో కొట్టండని అంతేగాని ఇండస్ట్రీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

- Advertisement -