శ్రీరామ నవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో పాతబస్తీలో శ్రీరాముని శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో 12 వేల మంది పోలీసులతో అడుగడుగునా భారీ బందోబస్తు, 500 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు, పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయమశాలకు శోభాయాత్రలు చేరుకోనున్నాయని చెప్పారు.
గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ నేతృత్వంలో గంగాబౌలిలోని ఆకాష్‌పురి హనుమాన్ మందిరం రాణి అవంతిబాయి నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రను పురస్కరించుకుని పలు విగ్రహాలను నిర్వాహకులు తయారు చేశారు. శివాజీ, రథం, సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాలతో పాటు హ నుమాన్‌జీ విగ్రహాలను సిద్ధంగా ఉంచారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ శోభాయాత్ర నగర వీధుల మీదుగా నిర్వహించనున్నారు. ఈ యా త్రలో ఏర్పాటు చేసే విగ్రహాలు ప్రత్యేక ఆకర్శణగా నిలువనున్నాయి. భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్స్ నుంచి వేలాది మందితో యాత్ర ప్రారంభం కానుం ది. అదే విధంగా టీఆర్‌ఎస్ నాయకులు ఆనంద్‌సింగ్ నేతృత్వంలో శ్రీరామ, లక్ష్మణ, సీతా, హనుమంతుల పల్లకీ యాత్రను ప్రారంభించడం జరుగుతుంది.
సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, రాణి అవంతిబాయి నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర మంగళ్‌హాట్, జాలి హనుమా న్, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి చౌరస్తా, కమల్‌కాన్ దేవ్డీ, క్లాసిక్ చౌరస్తా, సిద్ధింబర్‌బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి మీదుగా హనుమాన్ వ్యాయామ శాల వరకు నిర్వహిస్తారు.
శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ప్రతి సం వత్సరం పలు దేవతా మూర్తుల విగ్రహాలను ఏర్పా టు చేసి యాత్రలో ముందుంచుతారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీరాముని విగ్రహం, భారత మాత విగ్రహాలను తయారు చేశారు.. అంతేకాకుండా శోభాయాత్ర సందర్భంగా పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో గోషామహల్ ఏసీపీ ఎం.నరేందర్ రెడ్డి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, ఎం.రవీందర్‌రెడ్డిలతో పాటు పలు పోలీస్ స్టేషన్‌లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, పలువురు అధికారులు బందోబస్తు చేపట్టనున్నారు.