బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరైన శ్రీముఖి అందాల ఆరబోత గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. షోలతో పాటు అవార్డు ఈవెంట్స్ లో కూడా సూపర్ సెక్సీ పోజుల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లను కుదిపేస్తూ ఉంటుంది ఈ బొద్దు గుమ్మ. పైగా అతి తక్కువ కాలంలోనే టీవీ యాంకర్ గా మంచిపేరు సంపాదించుకొన్న శ్రీముఖి కి అనేక సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా భోళా శంకర్ సినిమాలోనూ శ్రీముఖి తన అందం గుమగుమలను చూపించింది. కానీ, ఆ మెగా సినిమా, బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. లేకపోయి ఉంటే.. శ్రీముఖి క్రేజ్ మరింతగా పెరిగేది.
అయినప్పటికీ, ఆమెకు చిన్న సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. కానీ వాటిని శ్రీముఖి తిరస్కరిస్తున్నట్లు టాక్. కారణాలు ఏమిటో తెలియదు. బహుశః తను కోరుకొన్న పాత్రలు రాకపోవడం చేతనో, లేక సినిమాల కోసం కుటుంబానికి దూరం కావడం ఇష్టం లేకనో, లేకపోతే కోరుకున్న రెమ్యునరేషన్లు ఇవ్వడం లేదనో.. మొత్తానికి శ్రీముఖి చిన్న సినిమాల మేకర్స్ మొహం కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. చిన్న సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేసినా రాని డబ్బు, పెద్ద సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసినా వస్తోంది. అందుకే, చిన్న సినిమాలకు శ్రీముఖి నో డేట్స్ బోర్డును పెట్టేస్తోంది.
Also Read:డీప్‌ఫేక్.. హీరోయిన్లే కాదు.. అందరూ!
దీనికితోడు, ఈ మధ్య కాలంలో శ్రీముఖి అనేక సినిమా ఆడియో విడుదల కార్యక్రమాలలో లేదా సినీ ప్రమోషన్ కార్యక్రమాలలోనొ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. అంతే కాదు ఈమధ్య స్టేజ్ మీద సినిమా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. ఇక ఈవెంట్స్ లో శ్రీముఖి ప్రదర్శించే సెక్సీ హావభావాలను, ఆమె వేసుకొనే దుస్తులని చూసి ఆమెను అభిమానించే మహిళలు కూడా షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా ఆమె పర్సనాలిటీ లాగానే, శ్రీముఖి ఏం చేసినా సాలిడ్ గానే ఉంటుంది.
Also Read:రాజకీయాల చుట్టూ ఎన్టీఆర్ ‘దేవర 2’