- Advertisement -
శ్రీలంక పార్లమెంట్ రద్దైంది. పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. గత ప్రభుత్వ ఆర్టికల్ 19ఏను సవరించి పెద్ద తప్పు చేసిందని భావించిన రాజపక్స సర్కార్..ముందస్తుగా ప్రజా తీర్పును కోరే నేపథ్యంలో పార్లమెంట్‌ను రద్దు చేసింది.
గొటబయ సర్కార్‌కు మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే రద్దు చేయడం గమనార్హం. ఏప్రిల్ 25న ఎన్నికలు జరగనుండగా మార్చి 12 నుంచి 19లోపు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయవచ్చు. మే 14వ తేదీన కొత్త పార్లమెంటు సమావేశం కానుంది. పార్లమెంట్ రద్దు నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఆ దేశ ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.
- Advertisement -