యాదాద్రీశుడికి భక్త కోటి కానుకలు..

72
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పరిచిన తర్వాత యాదాద్రిలోని లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. గత 20రోజులుగా స్వామి వారికి సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం కోటీ 84లక్షలు వచ్చాయని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు.

బంగారం కిలో 144గ్రాములు వెండి రెండు కిలోల 850గ్రాములు కానుకలుగా సమర్పించారు. ఇవే గాకుండా విదేశీ కరెన్సీలో కూడా పెద్ద మొత్తంలో కానుకల రూపంలో సమర్పించుకున్నారు. ఇందులో అమెరికా 1024 డాలర్లు, యూఏఈ 210 దిర్హామ్, ఆస్ట్రేలియా 145 డాలర్లు, ఇంగ్లాండ్ 20పౌండ్స్‌, కెనడా 300 డాలర్లు, ఒమాన్ 1బైసా, సింగపూర్‌ 15డాలర్లు, మెక్సిక్‌్ 200డాలర్ల సమర్పించారని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

సొంత గూటికి పొంగులేటి..?

ఢిల్లీ మేయర్‌ ఎన్నిక వాయిదా…

వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..

- Advertisement -