- Advertisement -
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని విషయాల్లో పూర్తి అవగాహన ఉందన్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. వారణాసి కాశీ లో జరిగే అతిరుద్ర మహాయగం లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి పాల్గోన్నారు. ఈసందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి తెలంగాణా రాష్ట్రం ను సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కి అన్ని విషయాలలో అవగాహన ఉంది.
తిరుపతి తరహా లో తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి డేవాలయంను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత అర్చకులకు జీతాలు ఇవ్వడమనేది చాలా గొప్ప ఆలోచన. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇస్తే వారితో కలిసి హైదరాబాద్ లో మొట్టమొదటి సారిగా అతిరుద్ర మహాయగం ను నిర్వహిస్తానని తెలిపారు.
- Advertisement -