ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (4; 7 బంతుల్లో) రెండో ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు. క్రిస్ మోరిస్ వేసిన షార్ట్‌బాల్‌ను భారీ షాట్ ఆడబోయి మిడాన్‌లో అమిత్‌మిశ్రా చేతికి చిక్కాడు. మరో ఒపెనర్ ధావన్‌కు విలియమ్సన్ తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ధాటిగా ఆడిన విలియమ్సన్(89; 51 బంతుల్లో) క్రిస్ మోరీస్ బౌలింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రేయాస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ధావన్(70; 50 బంతుల్లో) కూడా మోరీస్ బౌలింగ్‌లో మాధ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. యువరాజ్(3) మోరీస్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. జహీర్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో 17 పరుగులు రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 191 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లలో క్రిస్ మోరీస్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
ఐపీఎల్10: సన్‌రైజర్స్ హైదరాబాద్.. 191
- Advertisement -
- Advertisement -