సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అద్భుత విజయం..

299
SRH beat RCB by five runs
- Advertisement -

సన్‌రైజర్స్‌ ఖాతాలో మరో అద్భుత విజయం చేరింది. హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు అనేలా వారి ఆట తీరు కనబరిచారు. వేదిక ఏదైనా గెలుపును సులభంగా మార్చుకున్న హైదరాబాద్ వరుస విజయాల జోరును కొనసాగిస్తున్నది. సోమవారం రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 141/6 స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ కోహ్లీ(39), గ్రాండ్‌హోమీ(33) మినహా ఎవరూ రాణించలేకపోయారు. షకీబల్ హసన్(2/36) రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. తొలుత కెప్టెన్ విలియమ్సన్(56) అర్ధసెంచరీకి తోడు షకీబల్‌హసన్(35) రాణింపుతో హైదరాబాద్ 20 ఓవర్లలో 146/10 స్కోరు చేసింది. సిరాజ్(3/25), సౌథీ(3/30) మూడేసి వికెట్లు తీశారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

SRH beat RCB by five runs

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హేల్స్‌ (బి) సౌథి 5; ధావన్‌ (సి) సౌథి (బి) సిరాజ్‌ 13; విలియమ్సన్‌ (సి) మన్‌దీప్‌ (బి) ఉమేశ్‌ 56; పాండే (సి) కోహ్లి (బి) చాహల్‌ 5; షకిబ్‌ (సి) ఉమేశ్‌ (బి) సౌథి 35; పఠాన్‌ (బి) సిరాజ్‌ 12; సాహా (సిరాజ్‌) 8; రషీద్‌ రనౌట్‌ 1; భువనేశ్వర్‌ నాటౌట్‌ 1; కౌల్‌ రనౌట్‌ 1; సందీప్‌ ఎల్బీ (బి) సౌథి 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 146;
వికెట్ల పతనం: 1-15, 2-38, 3-48, 4-112, 5-124, 6-134, 7-143, 8-144, 9-146, 10-146;
బౌలింగ్‌: మొయిన్‌ అలీ 3-0-19-0; ఉమేశ్‌యాదవ్‌ 4-0-36-1; సౌథీ 4-0-30-3; సిరాజ్‌ 4-0-25-3; చాహల్‌ 4-0-25-1; గ్రాండ్‌హోమ్‌ 1-0-8-0

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: వోహ్రా (బి) సందీప్‌శర్మ 8; పార్థీవ్‌ పటేల్‌ ఎల్బీ (బి) షకిబ్‌ 20; కోహ్లి (సి) పఠాన్‌ (బి) షకిబ్‌ 39; డివిలియర్స్‌ (బి) రషీద్‌ఖాన్‌ 5; మొయిన్‌ అలీ (సి) సాహా (బి) కౌల్‌ 10; మన్‌దీప్‌ నాటౌట్‌ 21; గ్రాండ్‌హోమ్‌ (బి) భువనేశ్వర్‌ 33; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 141;
వికెట్ల పతనం: 1-24, 2-60, 3-74, 4-80, 5-84, 6-141;
బౌలింగ్‌: సందీప్‌శర్మ 4-0-20-1; భువనేశ్వర్‌ 4-0-27-1; షకిబ్‌ 4-0-36-2; సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-25-1; రషీద్‌ఖాన్‌ 4-0-31-1.

- Advertisement -