ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ పై విధించిన నిషేధం ముగియనున్న సంగతి తెలిసిందే. 2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణ నేపథ్యంలో బీసీసీఐ జీవితకాల నిషేధం విధంచగా తర్వాత సుప్రీం కోర్టు దానిని ఎత్తివేసింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే తన రీ ఎంట్రీపై ధీమాతో ఉన్న ఈ 37 ఏళ్ల పేస్ బౌలర్ త్వరలో భారతజట్టులో చోటు సంపాదిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కేరళ జట్టు కోచ్ శ్రీశాంత్‌కు శుభవార్తను అందించారు.
శ్రీశాంత్ తన ఫిట్‌నెస్‌ను నిరూపిస్తే రంజీ జట్టు ఎంపిక కోసం పరిశీలిస్తామని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్ త్వరలోనే తాను కేరళ రంజీ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబర్చి వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పారు.
తనని కొనుగోలు చేయడానికి కొన్ని జట్లు ఆసక్తిగా ఉన్నాయని….. ఐపీఎల్ లో ఆడటం ద్వారా మాత్రమే నేను తనపై పడిన నిందకు సమాధానం ఇవ్వగలను చెప్పాడు. ఇక శ్రీశాంత్ ఐపీఎల్‌లో రాజస్ధాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.