16వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు…

242
petrol
- Advertisement -

దేశంలో వరుసగా 16వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. దీంతో వాహనాదారులు మరింత్ షాక్ తగలనుంది. సోమవారం లీటర్ పెట్రోల్ ధర 34 పైసులు పెరిగి రూ. 82.59కి చేరగా డీజిల్ 547 పైసలు పెరిగి ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.77.06కి చేరింది. 16 రోజుల్లో పెట్రోల్ ధర రూ.8.34 పెరగగా డీజిల్ పై రూ.8.84 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 33 పైసలు పెరుగుదలతో రూ.79.56కు చేరగా డీజిల్ ధర కూడా 58 పైసలు పెరుగుదలతో రూ.78.85కు చేరింది.అమరావతిలో పెట్రోల్‌ ధర 33 పైసలు పెరుగుదలతో రూ.82.95కు చేరింది. డీజిల్‌ ధర కూడా 54 పైసలు పెరుగుదలతో రూ.77.41కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.95 శాతం పెరుగుదలతో 42.34 డాలర్లకు చేరింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారులపై పెనుభారం పడుతోంది.

- Advertisement -