వెబ్ సిరీస్ లోకి శ్రీనువైట్ల..?

233
Srinu-Vaitla-
- Advertisement -

మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, వరుణ్ తేజ్ ఇలా వరసగా వీళ్ళతో సినిమాలు చేసే అవకాశం రావడం ఏ దర్శకుడికైనా అంతకంటే కావలసింది ఏముంటుంది. శీను వైట్ల కూడా అదే ఎంజాయ్ చేసాడు.  ఒకప్పుడు వైట్లతో సినిమా చేసే అవకాశం కోసం చూసిన స్టార్లందరూ ఇప్పుడతడికి ముఖం చాటేస్తున్నారు.

Srinu-Vaitla-

ఇలాంటి తరుణంలో వైట్ల పరిస్థితి ఏంటా అని చూస్తుంటే.. అతను సినిమాలు పక్కన పెట్టేసి వేరే రూట్లోకి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లాభం లేదని శీను వైట్ల వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తాజా సమాచారం. ఒక ప్రముఖ ప్రొడక్షన్ కంపనీ తీయబోయే కామెడీ సిరీస్ కి శీనునే సారధ్యం వహించబోతున్నాడు. మరో వెబ్ సిరీస్ కూడా డిస్కషన్ స్టేజి లో ఉంది. సినిమా కెరీర్ డల్ అయిన వాళ్ళు ఈ మధ్య దీన్నో కెరీర్ గా మార్చుకుంటున్నారు. వరుణ్ సందేశ్, నవదీప్, సుమంత్ అశ్విన్ లాంటి హీరోలు ఇప్పటికే ఆ లైన్ లోకి వెళ్ళిపోయారు. కొందరు రచయితలు కూడా షిఫ్ట్ అయిపోయారు.

Srinu-Vaitla-

ఫిలిం కెరీర్ అయోమయ స్థితికి చేరుకున్న సమయంలో వైట్ల లాంటి సీనియర్ దర్శకుడు వెబ్ సిరీస్ బాట పట్టడం చిత్రమైన విషయమే. మరి ఇందులో అతనేమేరకు సక్సెస్ అవుతాడో చూద్దాం.

- Advertisement -