బిగ్ బాస్ ఫైనల్‌ రేసులో రాహుల్‌- శ్రీముఖి..!

564
sreemukhi
- Advertisement -

కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది.. ఫైనల్ ఎపిసోడ్‌ షూట్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 31, నవంబర్ 1, 2 తేదీల్లో విన్నర్ ఫైనల్‌ ఎపిసోడ్ షూట్ జరగనుంది. ఇందుకోసం సీజన్ 3లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందర్నీ బిగ్ బాస్ స్టేజ్ మీదికి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3లో వరుణ్, రాహుల్, శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్‌లు ఇప్పటికే ఫైనల్‌కి చేరుకోవడంతో ఓటింగ్ రసవత్తరంగా మారింది.

అయితే ప్రధానంగా శ్రీముఖి, రాహుల్‌లు టైటిల్ ఫేవరేట్‌గా నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అయితే ఓట్లు ఎవరికి ఎన్ని వస్తున్నాయన్నది సీక్రెట్‌గానే ఉంచినప్పటికీ హైప్ మాత్రం ఇద్దరిపైనే ఉంది. రెండు వారాల క్రితం వరకూ వరుణ్ సందేశ్ లేదా శ్రీముఖిలలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విన్నర్ కాబోతున్నారని ప్రచారం జరగ్గా.. అనూహ్యంగా చివరి వారానికి చేరుకునే సరికి రాహుల్‌‌ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

rahul

శ్రీముఖితో రాహుల్‌కి ఉన్న వైరమే అతనికి సపోర్టర్స్ పెరిగేలా చేసింది. అయితే వీకెండ్‌లోపు ఈ లెక్కలు తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బిగ్‌బాస్‌ టైటిల్‌తోపాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకునేది ఎవరో వేచి చూడాల్సిందే. ఇక ఫైనల్‌ ఎపిసోడ్‌లో ప్రత్యేక అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవిని బిగ్‌బాస్‌ షోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆయన చేతుల మీదుగా బిగ్‌బాస్‌ విజేతకు టైటిల్‌ అందజేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

- Advertisement -