ధమాకాలో ప్రణవిగా శ్రీ‌లీల

66
raviteja
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కినల‌ ఫ‌స్ట్ క్రేజీ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా ధమాకా చిత్రం రాబోతోంది. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు.

పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. వాలెంటైన్స్ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ప్రేమికుల రోజు కావడంతో రవితేజ, శ్రీలీల జంటగా ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల క్యూట్‌గా కనిపిస్తోంది. వారిద్ద‌రి మ‌ధ్య‌ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల పాత్ర పేరు ప్రణవి.ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.ధ‌మాక ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌య్యింది
నటీనటులు: రవితేజ, శ్రీలీల
సాంకేతిక బృందం
దర్శకుడు: త్రినాథరావు నక్కిన
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్స్: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
స్టోరీ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: భీమ్స్ సిసిరిలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగల

- Advertisement -