శ్రీవిష్ణు… ‘శ్వాగ్’ అప్‌డేట్

13
- Advertisement -

శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘రాజ రాజ చోర’తో బ్లాక్‌బస్టర్‌ హిట్ ఇచ్చారు. సైడ్- స్ప్లిట్టింగ్ ఎంటర్టైనర్ ‘శ్వాగ్’ కోసం వారు రెండుసారి చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ సింగరో సింగను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ఫెస్ట్ ని ప్రారంభించారు, సోషల్ మీడియా సెన్సేషన్ అయిన సింగరేణి అకా సింగగా శ్రీ విష్ణు పాత్రను పరిచయం చేశారు.

వివేక్ సాగర్ ఎక్స్ ట్రార్డినరీ కంపోజిషన్, నిక్లేష్ సుంకోజీ ఆకట్టుకునే లిరిక్స్, బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మిల ఎనర్జిటిక్ వోకల్స్ పాట ఇన్స్టంట్ గా నచ్చేలా చేస్తుంది. ఈ పాటలో శ్రీవిష్ణు డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ఇందులో విజువల్స్ అలరిస్తున్నాయి. హీరో పాత్రను పరిచయం చేయడంలో దర్శకుడు హసిత్ గోలీ క్రియేటివ్ ఐడియాని ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది.

వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవి హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తున్నారు. వేదరామన్ శంకరన్ డీవోపీ కాగా, విప్లవ్ నైషధం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను నిర్వహిస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

Also Read:డిసెంబర్‌లోనే కన్నప్ప.. విష్ణు హిట్ కొట్టేనా?

- Advertisement -