Single:ఓటీటీలోకి సింగిల్

7
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు నటించిన చిత్రం ‘సింగిల్’. మే 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని దాటేసి, లాభాల బాట పట్టింది. శ్రీవిష్ణు సరసన అందాల భామలు కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.

తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్య‌వ‌హారించారు.

విజయ్‌(శ్రీవిష్ణు) ఓ బ్యాంక్‌లో ఉద్యోగి. తోటివారంతా లవర్స్‌తో సెటిలైపోతుంటే.. తానుమాత్రం ఇంకా సింగిల్‌గానే ఉండటం విజయ్‌ భరించలేకపోతుంటాడు. అలాంటి సందర్భంలో తనకు పూర్వ(కేతిక) తారసపడుతుంది. తొలి ప్రేమలోనే తను ప్రేమలో పడిపోతాడు. హరిణి(ఇవానా) అనే డాన్స్‌ టీచర్‌ విజయ్‌ని ప్రేమిస్తూ వుంటుంది. విజయ్‌ని ఎలాగైనా ప్రేమలో పడేసేందుకు తను ప్రయత్నిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది…శ్రీవిష్ణు సింగిల్‌గా ఎలా మిగిలాడు అన్నదే సినిమా కథ.

Also Read:Kannappa:కన్నప్పలో రజనీకాంత్!

- Advertisement -