యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంటర్టైనర్ రాజ రాజ చోర
. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా విడుదలైన ఎంటర్టైనింగ్ టీజర్, పాటలు సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. నిర్మాతలు ఈ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకోవాలని, మంచి సినిమాలను చూడాలనుకుంటున్నారు. రాజ రాజ చోర
ఈ అపరిమితమైన వినోదాన్ని అందించడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు.
రాజరాజ చోర
చిత్రంలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగగా హిలేరియస్ పాత్రలో కనిపించబోతున్నారు. మేఘా ఆకాశ్ మెయిన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మరో హీరోయిన్గా సునైన కనిపించనుంది. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వేద రామన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు.
నటీనటులు:
శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్, సునైన, తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్ ఘోష్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: హసిత్ గోలి
నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: క్రితి చౌదరి
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేద రామన్
ఎడిటింగ్: విప్లవం నైషదం
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టైలింగ్: శ్రుతి కూరపాటి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్