ఆర్‌.కె.సాగ‌ర్‌…’ ది 100′

173
100
- Advertisement -

హీరో ఆర్‌.కె.సాగ‌ర్‌.. షాదీ ముభార‌క్‌ చిత్రంతో స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న క‌థానాయ‌కుడిగా డెబ్యూ డైరెక్ట‌ర్ రాఘ‌వ్ ఓంకార్ శ‌శిధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌.కె.మీడియా ర్క్స్‌ బ్యాన‌ర్‌లో ది 100 అనే ఆస‌క్తిక‌ర‌మైన సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది.

ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో రూపొంద‌నున్న ది 100 సినిమాలో ఆర్‌.కె.సాగ‌ర్.. విక్రాంత్ అనే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని వెన‌క్కి తిరిగి నిల‌బ‌డిన ఆర్‌.కె.సాగ‌ర్ లుక్ చాలా ఇన్‌టెన్స్‌గా ఉంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా ఫిట్ లుక్‌తో క‌నిపించ‌డానికి సాగ‌ర్ త‌న శ‌రీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారని, సినిమా హై యాక్ష‌న్ మూవీగా రూపొంద‌నుంద‌ని పోస్ట‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఈ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కు శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

న‌టీన‌టులు:
ఆర్‌.కె.సాగ‌ర్‌

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: రాఘ‌వ్ ఓంకార్ శ‌శిధ‌ర్‌
నిర్మాణ సంస్థ‌: ఆర్‌.కె.మీడియా వ‌ర్క్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కె.నాయుడు
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

- Advertisement -