శ్రీ విష్ణు ‘బ్రోచేవారెవరురా’

291
Sree Vishnu Nivetha Thomas Nivetha Pethuraj in Brochevarevarura
- Advertisement -

యంగ్ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు వివేక్ క‌లిసి మ‌రోసారి సినిమా చేయ‌నున్నారు. మెంటల్ మదిలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ సారి క్రైమ్ కామెడీతో రాబోతున్నారు ఈ జోడి. ఈ చిత్రానికి బ్రోచేవారెవరురా అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నివేదాథామస్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయకుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు:శ్రీ విష్ణు, నివేద థామస్, నివేద పేతురాజ్, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ..
సాంకేతిక నిపుణులు:రచన దర్శకత్వం: వివేక్ ఆత్రేయ, నిర్మాత: విజయ్ కుమార్ మన్యం ,బ్యానర్: మన్యం ప్రొడక్షన్స్ ,సంగీతం: వివేక్ సాగర్ ,సినిమాటోగ్రఫీ: శ్రీ రామ్, ఎడిటర్: రవితేజ గిరిజాల,పిఆర్ఓ: వంశీ శేఖర్

- Advertisement -