మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. దర్శకుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుదలైన రోజు నుంచి ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్ విజయం దిశగా చిత్రం కొనసాగుతుంది. ఈ చిత్రం రెండో వారంలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం గ్రాండ్ బ్లాక్‌బస్టర్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఈ గ్రాండ్ సక్సెస్ మీట్ కు అతిథిగా విచ్చేసిన సాయి రాజేష్ మాట్లాడుతూ నాకు హారర్, థ్రిల్లర్, క్రైమ్ జానర్‌లంటే వాటి వసూళ్ల పరిథి తక్కువగా వుంటుందనే అంచనా వుండేది. వంశీ నందిపాటి ఈ సినిమా హక్కులు తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నాడు నీకు పిచ్చి పట్టిందా? అన్నాను. కానీ వంశీ మాత్రం తన కాన్పిడెన్స్‌తో సినిమాను విడుదల చేశాడు. కానీ ఈ సినిమా ఫలితం చూసిన తరువాత నా అంచనాలు తప్పు అని తెలుసుకున్నాను. ఈ సినిమా నాకు జడ్జిమెంట్ విషయంలో కనువిప్పు కలిగింది. ఈ సినిమాకు కథే కింగ్. ఈ సినిమా విజయం సాధించడం చాలా హ్యపీగా వుంది. నాకు తెలిసి రాబోయే పోలిమేర 3 కూడా బ్లాక్‌బస్టర్ కొడుతుంది. ఎటువంటి సందేహం లేదు అన్నారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ నాకు ఎప్పట్నుంచో తెలుసు. సత్యం రాజేష్ నేను హీరో అవుతానని నమ్మిన వ్యక్తి. ఆయన మాటలు నాకు తెలిసిన ఇంత మంది మిత్రులకు హిట్ ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా వుండదు. సినిమా విడుదల తరువాత అది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. పోలిమేర 2 అనేది చాలా పెద్ద సినిమా. కొన్ని సినిమాలు బాగున్నా థియేటర్స్‌లో ఆడవు. కానీ ఈ సినిమా వరల్డ్‌కప్ జరగుతున్న సమయంలో ఇంత మంచి కలెక్షన్స్‌తో విజయవంతంగా ఆడటం గొప్ప విషయం. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా అన్నారు.
Also Read:టాలీవుడ్ చంద్రమోహన్ ను అవమానించిందా?