Sree leela:ఉఫ్..శ్రీలీల చాలా ముదురు!

48
- Advertisement -

గత వారం వరకూ ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ ప్రమోషన్స్ లో భాగంగా… అలాగే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తూ ఫోటో షూట్స్ వదులుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల ‘గుంటూరు కారం’ ముచ్చట్లు మాత్రం చెప్పడం లేదు. ‘గుంటూరు కారం’లో మహేష్ కి జోడిగా నటించింది. ఈ చిత్రం మరో నెల రోజుల్లో విడుదల కాబోతుంది. జనవరి 12 న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఫస్ట్ లుక్ బాగా ఇంప్రెస్స్ చేసింది. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియాలో హడావుడి మొదలయ్యింది. అందుకే, శ్రీలీల ఏమైనా గుంటూరు కారం కబుర్లు చెబుతుంది అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

శ్రీలీల ఏమో అందమైన ముచ్చట్లు చెబుతూ యూత్ గుండెల్లో గునపాలు దింపుతోంది కానీ.. గుంటూరు కారం విషయంలో పెదవి విప్పడం లేదు. అదేమిటి అంటే.. గుంటూరు కారం సినిమా ‘నా కెరీర్ లో గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది అంటూ రెగ్యులర్ బిస్కెట్ మాటలు చెబుతుంది గానీ, అసలు గుంటూరు కారం లో తన పాత్ర ఏమిటి ?, ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి ?, అలాగే మహేష్ బాబుతో సాగే తన లవ్ ట్రాక్ ఏమిటి ? ఇలాంటి విషయాలను అస్సలు విప్పడం లేదు. మొత్తానికి శ్రీలీల చాలా ముదురు అంటూ తేల్చి పారేస్తున్నారు నెటిజన్లు.

ఇంత చిన్న వయసులోనే మీడియాను, ఫ్యాన్స్ ను ఎలా మ్యానేజ్ చేయాలో శ్రీలీల బాగా నేర్చుకుంది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం శ్రీలీల కు టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే శ్రీలీల కూడా పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ లో మత్తెక్కించే చూపులతో కసిగా కనిపిస్తూ.. కవ్విస్తూ.. తనలోని గ్లామర్ రసాన్ని మొహమాటం లేకుండా గుమ్మరిస్తూ.. ముందుకు సాగుతుంది. ఇక గుంటూరు కారం సినిమాలో మహేష్ సరసన ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో అనే విషయంలో ఆమె ఫాన్స్ చాలా ఆతృతగా కనిపిస్తున్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:అమర్‌ని దొంగ చేసేశారు

- Advertisement -