ఫుల్ స్వింగ్‌లో శ్రీలీల

45
- Advertisement -

శ్రీలీల చూస్తుండగానే స్టార్ హీరోయిన్ అయిపోయింది. నిజానికి ఒక్కో హీరోయిన్ కి ఒక్కో టైమ్ వస్తుంది. ఇప్పుడు శ్రీలీల కి వచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా 25 ఏళ్ల లోపే టాప్ లో ఉంది. శ్రీలీలకి వచ్చిన క్రేజ్ చూస్తుంటే.. ఆమె మరో పదేళ్ల వరకూ నెంబర్ వన్ హీరోయిన్ గా దున్నేసేలా ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ భామకి ఇప్పుడు అన్ని పెద్ద చిత్రాలే దక్కుతున్నాయి. ఇప్పటికే “గుంటూరు కారం” సినిమాతో భారీ సినిమాని తన ఖాతాలో వేసుకొంది. “గుంటూరు కారం” కన్నా ముందు అనిల్ రావిపూడి తీసిన “ భగవంత్ కేసరి” సినిమాతో ఆల్ రెడీ రికార్డు హిట్ కూడా కొట్టింది.

దీంతో శ్రీలీల ఖాతాలో ఇప్పుడు అన్నీ భారీ చిత్రాలే వస్తున్నాయి. బుచ్చి బాబు – రామ్ చరణ్ కొత్త చిత్రంలో కూడా హీరోయిన్ పాత్ర మాత్రం శ్రీలీల దే. చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో స్టార్లు కూడా నటిస్తున్నారు. అలాంటి సినిమాలో చరణ్ కి హీరోయిన్ గా శ్రీలీల నటిస్తే.. ఆమెకు పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ వచ్చినట్టే. ఇంత తక్కువ టైంలో ఏ హీరోయిన్ కి ఈ రేంజ్ ఛాన్స్ దక్కింది లేదు. ఒక విధంగా చెప్పాలంటే రష్మిక మందన్నా కన్నా శ్రీలీల అకౌంట్లోనే ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాలు ఉన్నాయి.

Also Read:పిక్ టాక్ : ఉఫ్.. అందాల పటాకా పేల్చింది

తెలుగు సినిమా రంగానికి సంబంధించి ఇప్పుడు ఆల్ టైం ఫేవరేట్ హీరోయిన్స్ ఎవరు అంటే.. శ్రీలీల పేరే ముందు చెప్పాలి. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్లు లేవు. ఎలాగూ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఆల్ టైం హిట్ ని సొంతం చేసుకోవాలని శ్రీలీల ప్రయత్నిస్తోంది. మరి ఇది నిజం అయితే, ఇక ఆమెను ఆపడం ఎవరి తరం కాదు. ఏది ఏమైనా ప్రస్తుతం శ్రీలీల టైమ్ నడుస్తోంది.

Also Read:టీమిండియాకు హెచ్చరికలు..!

- Advertisement -