మహేశ్‌ 28లో శ్రీలిల!

97
sreeleela
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేశ్‌ కెరీర్‌లో ఇది 28వ సినిమా కాగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఆ అంచనాలకు తగ్గట్టుగానే కథను సిద్ధం చేశాడు మహేశ్.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ మరదలు పాత్రలో పెళ్ళిసందD బ్యూటీ శ్రీలీల నటించబోతోందట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేశ్, శ్రీలీలపై ఒక పాట కూడా ఉండనుందని టాక్.

దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించబోతున్నాడు.

- Advertisement -