హీరోయిన్ ‘శ్రీలీల’ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ‘పెళ్ళిసందD చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా తర్వాత ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అయితే కొంతకాలంగా శ్రీలీల,కార్తీక్ ఆర్యన్..ల మధ్య ప్రేమ చిగురించిందని, ప్రస్తుతం వారు డేటింగ్లో ఉన్నారనే వార్తలు కూడా షికారు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీలీలకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల పెళ్లికూతురి గెటప్‌లో కనిపించడంతో పాటు, కొందరు ఆమె చెంపలకు పసుపు రాస్తున్న దృశ్యాలు ఉన్నాయి. నాకు ఈ రోజు చాలా పెద్దది (బిగ్ డే)… పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాను, కమింగ్ సూన్ అంటూ ఆమె రాసుకురావడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీలీలకు రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందా? లేక పెళ్లి చేసుకోబోతోందా? అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Also Read:టీపీసీసీ చీఫ్..చిల్లర వ్యాఖ్యలు:హరీష్

