టీపీసీసీ చీఫ్..చిల్లర వ్యాఖ్యలు:హరీష్‌

5
- Advertisement -

పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

విలువలకు తిలోదకాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే మీరు నడుస్తున్నారు..బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్దాలు, నిజం అయిపోవు అన్నారు. పెళ్ళి లోనో, చావు లోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గాని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు అన్నారు.

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను..ఇలాంటి ఆరోపణలు మానుకొని, స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు పై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నాం అన్నారు.

 

Also Read:TTD: ఆకాశగంగ ఆధునీకరణ చేస్తాం

- Advertisement -