మోక్షజ్ఞ కోసమే ఆ కామెంట్స్ చేసిందా?

38
- Advertisement -

టాలీవుడ్‌ లక్కీ ఛార్మ్‌గా శ్రీలీలను అభివర్ణిస్తున్నారు. అయితే ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్లలో శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఓ యాంకర్.. ఏ హీరోతో లిప్ లాక్ సీన్ చేస్తారని ప్రశ్నించగా.. ‘నేను లిప్ లాక్ సీన్లలో అస్సలు నటించను. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అలా చేయాల్సి వస్తే మాత్రం ఫస్ట్ కిస్ కచ్చితంగా నా భర్తకే ఇస్తాను. అలాగే, నా రొమాన్స్ విషయంలో కూడా నేను నా భర్తకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను’ అంటూ శ్రీలీల తనదైన శైలిలో సమాధానమిచ్చింది.

అయితే, నెటిజన్లు మాత్రం నందమూరి మోక్షజ్ఞకి శ్రీలీల కి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుంది అని, వీరిద్దరి మధ్య ఉన్న బంధం కారణంగానే శ్రీలీల ఇలా కామెంట్స్ చేసింది అని టాక్ నడుస్తోంది. మొత్తానికి శ్రీలీల ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. ఆమెకు వరుసగా సినిమాలు వస్తున్నాయి. అలాగే, భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో శ్రీలీల కాబోయే భర్త గురించి, అతనితో చేయబోయే రొమాన్స్ గురించి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

అన్నట్టు శ్రీలీల తాజాగా రేంజ్ రోవర్ SUV కొనుగోలు చేసిందట. దీని విలువ సుమారు రూ.3 నుంచి 4 కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. ప్రస్తుతం శ్రీలీల కారుకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ భామ దగ్గర ఆడి Q7, జాగ్వార్ సెడాన్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. పైగా శ్రీలీల రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ విల్లా కూడా కొనుగోలు చేసిందని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం శ్రీలీల టైమ్ నడుస్తోంది.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన సోమశేఖర్,బిత్తిరి సత్తి

- Advertisement -