- Advertisement -
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ 101వ ఎపిసోడ్ సందర్భంగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ రోజు ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా మోదీ మన్ కీ బాత్‌లో ప్రసంగించారు. నందమూరి తారక రామారావు కోట్లాది మంది మనసుల్లో స్థానం సంపాదించారని అన్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్‌కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతో పాటు సినిమా రంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారు. తన నటనకౌశలంతో ఎన్నో చారిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్ జీవం పోశారని అన్నారు. బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్ సినీరంగంలో తనదైన ముద్రవేశారన్నారు. దాదాపుగా 300 సినిమాల్లో నటించి అలరించారు. అని మోదీ వ్యాఖ్యానించారు.
Also Read: CM KCR:ధార్మిక సమాచార కేంద్రంగా బ్రహ్మణ సదన్
- Advertisement -