ఎన్టీఆర్ వారసుడు.. కే‌సి‌ఆరే !

43
- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు జీవితం ఒక తెరచిన పుస్తకం. సినీ రంగంలోనూ రాజకీయాల్లోనూ ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదనే చెప్పాలి. తెలుగు సినీ రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి తొలి పునాది ఎన్టీఆరే అని చెప్పక తప్పదు. ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి పాలన విధానంలో ఎన్నో మార్పులను, గొప్ప సంస్కరణలను ప్రవేశ పెట్టిన నేతగా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోంతుంది. అయితే ఆయన తరువాత ఆ స్థాయి పరిపాలన ఎవరు కొనసాగించరనే ప్రశ్న ఎప్పుడు ఆసక్తికరమే. ఆయన తరువాత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేకర్ రెడ్డి, కె రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇక రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, రెండ నేత జగన్‌మోహన్‌రెడ్డి ఇటు తెలంగాణలో కే‌సి‌ఆర్(రెండు సార్లు సీఎం) పరిపాలన కొనసాగిస్తున్నారు.

మరి ఇంతమంది తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన నేతలలో ఎన్టీఆర్ ను గుర్తుకు చేసేలా పాలనలో మార్పులు, సంక్షేమంలో ప్రజా శ్రేయస్సు, నూతన సంస్కరణలకు పునాది.. వేసిన నాయకులు ఎవరైనా ఉన్నారా ? అంటే అది ఒక్క కే‌సి‌ఆర్ మాత్రమే అని చెప్పక తప్పదు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ అన్నీ రంగాల్లోనూ అగ్రపథాన దూసుకుపోతుందంటే కే‌సి‌ఆర్ పాలన విధానమనే చెప్పాలి. ఎన్టీఆర్ ఎలాంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారో ఆయన ఆశయ సాధనలకు అద్దం పట్టేలా కే‌సి‌ఆర్ కూడా ముందుకు సాగుతున్నారు. దీంతో ఎన్టీఆర్ నిజయమైన రాజకీయ వారసుడు కే‌సి‌ఆర్ ఒక్కరే అని అటు ప్రజలు ఇటు విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతున్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ” ఎన్టీఆర్ ఆశయ సాధనాలను నెరవేర్చుతూ పరిపాలన సాగిస్తూ ఆయన రాజకీయ వారసుడిగా కే‌సి‌ఆర్ నిలుస్తున్నారని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. అటు తెలంగాణ ప్రజల్లో కూడా ఇదే భావన ఉందనే చెప్పాలి.

Also Read: నిర్మల్‌…జూన్‌4న సీఎం కేసీఆర్ టూర్‌

- Advertisement -