ట్రాఫిక్ పోలీసుల తనిఖిలు…ఒక్కసారిగా కిందపడిపోయిన యువకుడు

181
SR Nagar Trafic Police

బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు తప్పకుండా హెల్మెంట్ పెట్టుకొవాలని ట్రాఫిక్ పోలీసులు మొత్తుకుంటున్న విషయం తెలిసిందే. ఒక వేళ హెల్మెంట్ లేకుండా బైక్ పై ప్రయాణిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. తాజాగా ఎస్సార్ నగర్ పోలీసులకు అనుకోని షాక్ తగిలింది.

హెల్మెంట్ లేకుండా బైక్ పై వస్తున్న వారిని పట్టుకుంటున్నారు పోలీసులు. అయితే అది గమనించిన ఓ యువకుడు హెల్మెట్ లేకుండా వాహనంపై వస్తున్నాడు. పోలీసులను చూడగానే ఒక్కసారిగా యువకుడికి ఫిట్స్ వచ్చి కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతని వద్దకు చేరుకున్న పోలీసులు చేతిలో తాళాలు పెట్టి అతన్ని పక్కన కూర్చోబెట్టారు.