క్రీడల్లో తెలంగాణ నం.1గా ఉండాలి- మంత్రి శ్రీనివాస్ గౌడ్

248
Sports Minister Srinivas Goud

రెండవ ఎడిషన్ అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ 2019 లోగోను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు. మొదటి తైక్వండో పోటీలు ఇంగ్లాండ్‌లో ప్రారంభించారు. ఇప్పుడు మొదటి సారి మన దేశంలో అది మన హైద్రాబాద్‌లో జరుగుతున్నాయి.

Sports Minister Srinivas Goud

ఈ పోటీలకు మొత్తం 25 దేశాల నుండి 10,000 మంది క్రీడాకారులు హాజరవుతారు.ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. స్టేడియం ఇతర ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు వచ్చే క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

జూన్11 నుండి 16 వరకు ఈ ఆటలు కొనసాగుతాయి. ఆటకు కావాల్సిన సామగ్రి అన్ని ఇతర దేశాలే సమకూర్చుకుంటాయి. అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్తుంది అలాగే క్రీడల్లో కూడా తెలంగాణ నంబెర్ వన్‌గా ఉండాలని ఆయన అన్నారు. ఒలింపిక్స్ లో తైక్వండో అతి పెద్ద క్రీడా దేశ వ్యాప్తంగా ప్రచారం ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.