నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఘన విజయం సాధించింది. 132 పరుగుల తేడాతో తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచింది. దీంతో మ్యాచ్‌ను మూడు రోజుల్లో ముగించింది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ 1-0తో లీడ్‌లో ఉంది.
తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 177పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల భారీ స్కోరు చేసి 223పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ(120), జడేజా(66), అక్షర్ పటేల్(52)తో భారీ స్కోర్ సాధించారు. అయితే ఆస్ట్రేలియా బౌలింగ్‌లో మర్ఫీ ఐదు వికెట్లు తీసి జట్టును ముందుండి నడిపించాడు.
అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రము ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 32.3ఓవర్లలో 91పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. రవిచంద్రన్ అశ్విన్ అత్యధికంగా ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా జట్టును నడ్డి విరిచాడు. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ పడింది.
ఇవి కూడా చదవండి…