సెక్రటేరియట్ విధుల్లోకి ఎస్పీఎఫ్ సిబ్బంది

1
- Advertisement -

సెక్రటేరియట్ సెక్యూరిటీ విధుల్లోకి ఎస్పీఎఫ్ సిబ్బంది చేరారు. కొత్త సెక్రటేరియట్ ప్రారంభం నుంచి విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బందిని మార్చి మళ్లీ ఎస్పీఎఫ్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.

ఏక్ పోలీస్ నినాదంతో టీజీఎస్పీ పోలీసుల ఆందోళనల నేపథ్యంలో ఇటీవల సీఎం ఇంటి దగ్గర సెక్యూరిటీ మార్పు చేశారు. సీఎం, మంత్రులు ఉండే రాష్ట్ర పరిపాలనసౌధమైన సెక్రటేరియట్ వివీఐపీ జోన్లో ఉన్న నేపథ్యంలో ఆందోళన బాట పట్టిన బెటాలియన్ సిబ్బందిని మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం.

గతంలో సుదీర్ఘకాలం పాటు సెక్రటేరియట్ భద్రతా బాధ్యతలు చూసిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ కు మళ్ళీ బాధ్యతలు అప్పగించారు. సచివాలయం ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించి, కవాతు చేసింది ఎస్పీఎఫ్ సిబ్బంది. ఇవాళ్టి నుంచి ఎస్పీఎఫ్ పహారాలోకి వెళ్లనుంది డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్.

Also Read:ఆకట్టుకుంటున్న ‘రోటి కపడా రొమాన్స్‌’ ట్రైలర్‌

- Advertisement -