అప్పుడు వలసల జిల్లా.. ఇప్పుడు అన్నపూర్ణ జిల్లా

248
mahaboobnagar dist
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతిపక్షాలు అభ్యర్ధులను ప్రకటించకముందే టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. వినూత్న రీతిలో ప్రచార పర్వాన్ని సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ పాలమూరు జిల్లాపై చేసిన ఓ లఘ చిత్రం ఆకట్టుకుంటోంది.

palamuru

సమైక్య పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా ఎండిపోయింది. కానీ.. తెలంగాణ సాధించుకున్నాక టీఆర్‌ఎస్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాలో పొలాలు పచ్చబడ్డాయి. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, లిఫ్ట్ ఇరిగేషన్‌తో 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. వలసల జిల్లా అన్నపూర్ణ జిల్లాగా మారింది. మరల దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెడదామా? అంటూ పాలమూరు అభివృద్ధిపై టీఆర్‌ఎస్ పార్టీ ఓ వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Mahabubnagar-district

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో ఇదే.. మీరు కూడా చూడండి.

- Advertisement -