పందితో రవిబాబు పాదయాత్ర..

298
ravi babu pig
- Advertisement -

టాలీవుడ్‌ నటుడు,దర్శకుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజాగా చిత్రం ‘అదుగో’ .ఈ మూవీలో ‘పందిపిల్ల’ ప్రధాన పాత్రలో కనబడనుంది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా నవంబర్ 7న దీపావళి కానుకగా ప్రేక్షకుల  ముందుకు రానుంది. తన స్వంత నిర్మాణ సంస్థ ఫ్లెయింగ్ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్నారు.

ర‌విబాబుతో పాటు ఈ చిత్రంలో అభిషేక్ వ‌ర్మ‌, న‌భా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్ల‌ను చాలా రియ‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు ర‌విబాబు.

adhugo

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వినూత్నంగా ప్ర‌చారం చేస్తున్నారు రవిబాబు. పంది పిల్ల‌కి ప‌ళ్ళు తోమ‌డం, పందిపిల్ల‌తో క‌లిసి పుష‌ప్స్ చేయ‌డం,పందిపిల్లతో క‌లిసి క్యూలో నిలుచోవ‌డం వంటివి చేసిన ర‌విబాబు నేటి సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కేబీఆర్ పార్క్ నుంచి ఫిలింఛాంబర్ వరకు ఈ పాదయాత్ర చేయ‌నున్నార‌ట‌. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు.

ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తుండ‌గా.. ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అదుగో అన్ని భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల అవుతుండ‌టం విశేషం.

- Advertisement -