ఎస్‌ఎల్‌బీసీ …..ఎవరీ పాపం ?

292
congress mps
- Advertisement -

ఆరేళ్ల క్రితం అనాథలా ఉన్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో సగర్వంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. నీళ్లు,నిధులు,నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ నేడు అన్నిరంగాల్లో అగ్రస్ధానంలో నిలిచింది. కాళేశ్వరంతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణంలా మారనుండగా పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తిచేస్తు తెలంగాణ రైతుల్లో సరికొత్త ఆశలే రెకేత్తించింది తెలంగాణ ప్రభుత్వం.

అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్ష కార్యక్రమంతో ఆ పార్టీ మరోసారి విమర్శల పాలైంది. కరోనా నేపథ్యంలో ఆ పార్టీ నేతల కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించగా ఈ సందర్భంగా హస్తం నేతలు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ప్రజలు పట్టించుకునే పరిస్ధితి కనిపించడం లేదు.

ఎందుకంటే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలు జానారెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డిలను చూసి ప్రజలు నవ్వుకునే పరిస్ధితి నెలకొంది.

ఓ సారి ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది…అది పూర్తికాకపోవడానికి గల కారణలను పరిశీలిస్తే…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 సంవత్సరంలో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) పనులను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగు నీరు, 250 గ్రామాలు పైగా తాగునీరు అందించడం కోసం ప్రారంభించిన ఈ ప్రాజెక్టును 2010లో పూర్తిచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన 1983-84 కాలంలో శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్ఆర్బీసీ)తో పాటు వచ్చిందే. అయితే ఎస్ఆర్బీసీ 1990 లోనే పూర్తి కాగా, ఎస్ఎల్బీసీ మాత్రం ఇంకా కొన..సాగుతూనేవుంది.

ఇక నాడు ప్రాజెక్టును ప్రారంభించిన సమయంలో ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉంది జానారెడ్డి,కోమటిరెడ్డి,ఉత్తమ్ కుమార్‌లే. దీంతో తమ జిల్లాకు మంచిరోజులు రానున్నాయని భావించిన ప్రజలకు ఏళ్ల తరబడి నిరీక్షణే మిగిలింది.ఈ ప్రాజెక్టు తర్వాత ప్రారంభించిన తెలుగు గంగ పూర్తయింది. కడప-కర్నూలు కాలువకు అనుసంధానమూ పూర్తయింది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ విస్తరణ కూడా పూర్తయి ఏళ్లు దాటింది. కానీ ఎస్‌ఎల్‌బీసీ మాత్రం నత్త నడకన నడుస్తూనే ఉంది.

ఇక నల్గొండ జిల్లాలో పెద్ద నాయకులు పెద్ద పెద్ద మాటలు చాలా కాలంగా చెప్పారు… కానీ నాటి సీఎం వైఎస్‌తో పట్టుబట్టి పనిచేయించింది లేదు. ఈ నాయకుల అశ్రద్ధ ఫలితంగా ప్రాజెక్టు వ్యయం రూ.1,925 కోట్ల అంచనా విలువతో ప్రారంభంకాగా.. తర్వాత అది రూ.3,152.72 కోట్లు, అనంతరం రూ.4200 కోట్ల అంచనాకు చేరింది.

ఇక నాడు వైఎస్‌ తనకు కావలసిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను మూడేళ్లలో అడ్డంగా తవ్వుకున్నారు. ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది. నాడు తెలంగాణ నాయకత్వానికే లేకపోయింది. ఆయన అడుగులకు మడుగులొత్తడంలోనే అందరూ తరించారు. ఫలితంగా తలపున నదులు ఉన్నా తెలంగాణ మాత్రం బీడుగానే ఉండిపోయింది.

కానీ నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్ధాయిలో ప్రాజెక్టుల పనులు జరగడమే కాదు పూర్తయి వాటి ఫలాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన కాంగ్రెస్‌ నేతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. నాడు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన ఈ ముగ్గురు మంత్రులు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఎక్కడ నిద్రపొయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాడు జలయజ్ఞం పేరుతో తెలంగాణలో జరిగిన ధనయజ్ఞం అందరికీ తెలుసని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.

- Advertisement -