పదోతరగతి విద్యార్థులకు మాస్కులు పంపిణీ..

317
ssc exams
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 6 వరకు పరీక్షలు జరగనుండటంతో అన్నిఏర్పాట్లు చేశారు అధికారులు.నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు సానిటేజర్,మాస్కులు అందించారు విద్యాశాఖ అధికారులు. ముఖాలకు మస్కు లు ధరించి పరీక్ష రాశారువిద్యార్థులు.

కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల దగ్గర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు దగ్గు, జలుబు ఉన్నట్లయితే ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్ధుల కోసం శానిటైజర్లు, లిక్విడ్‌ సబ్బులను అందుబాటులో ఉంచారు. ఇక విద్యార్థులు మాస్కులు ధరించినా, వాటర్‌ బాటిళ్లు తీసుకొచ్చినా పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -