ప్రభాస్ నా కొడుకు అని చెప్పిన అనుష్క..!

687
Anushka
- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ అనుష్క హీరోల‌కి స‌మానంగా అభిమానుల ఆద‌రాభిమానాలు ద‌క్కించుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క రీసెంట్‌గా నిశ్శ‌బ్ధం అనే చిత్రంలో న‌టించింది. గ‌త కొద్దిరోజులుగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి.ఈ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గా పాల్గొంటుంది అనుష్క . తాజాగా బుల్లితెర‌పై అత్యంత ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన కార్య‌క్ర‌మానికి త‌న టీంతో క‌లిసి హాజ‌రైంది స్వీటీ. దీనికి సంబంధించిన తాజాగా ప్రోమో విడుద‌ల చేశారు. ఈ ప్రోగ్రాంకి యాంకర్‌గా సుమ వ్యవహరిస్తోంది.

ఇందులో అనుష్క కన్నీరు పెట్టుకోవడం, ప్రభాస్‌ గురించి ఏదైనా చెప్పమంటే నా కొడుకు గురించా? అని అడగడం వంటి దృశ్యాలు ఉన్నాయి. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. మొదట ప్రభాస్ ఫోటోను సుమ చూపించి, ఇతడి గురించి పాజిటివ్ పాయింట్ చెప్పండి అని అడిగింది. ఈ సమయంలోనే అనుష్క ‘నా కొడుకు గురించా?’అని అడిగింది. దీంతో సుమ షాక్ అయింది. ‘మీ ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి కదా?’ అని ప్రశ్నించింది. దీంతో ‘నా కొడుకు కదండీ?’ అంటూ అనుష్క మరోసారి పంచ్ వేసింది. దీంతో ‘అమరేంద్ర బాహుబలి’ గురించి చెప్పమంది సుమ.

‘అమరేంద్ర బాహుబలి’ క్వాలిటీసే కొడుకుకు వచ్చాయి కదా? అని అనుష్క సమాధానమిచ్చింది. ఈ ప్రోమో చివ‌ర‌లో అనుష్క క‌న్నీరు పెట్టుకోవ‌డంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సైలెంట్ అయిపోయారు. ఆమె ఎందుకు ఏడిచిందో తెలుసుకోవాలంటే ప్రోగ్రాం చూడాల్సిందే.

- Advertisement -