స‌మ‌త‌ కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టు- ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

252
Minister Indrakaran reddy

స‌మ‌త కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐద‌వ‌ అదనపు సెషన్స్‌, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్త‌ర్వులో పేర్కొన్నారు.

కుమ్రం భీం- ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటూర్ స‌మ‌త కేసులో ప్రత్యేక‌ కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్న‌ట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. దిశ ఘ‌ట‌న త‌ర్వాత ప్ర‌భుత్వం వేగంగా స్పందించిందని, స‌మ‌త కేసులో కూడా స‌త్వ‌ర న్యాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కోర్టును ఏర్పాటు చేసిందని వెల్ల‌డించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం శాంతి భ‌ద్ర‌త‌లకు అధిక ప్రాధ‌న్య‌తనిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. దోషుల‌కు వెంట‌నే శిక్ష‌లు ప‌డేలా, భాదితుల‌కు స‌త్వ‌ర న్యాయ జ‌రిగేలా ప్ర‌భుత్వం త‌మ వంతుగా కృషి చేస్తుంద‌న్నారు. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

special court