రాహుల్ గాంధీపై స్పీక‌ర్ ఫైర్..

239
rahul, modi
- Advertisement -

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పార్ల‌మెంట్ లో వ్య‌వ‌హ‌రించిన తీరుపై మండిప‌డ్డారు లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్. నేడు పార్ల‌మెంట్ లో అవిశ్వాస తీర్మానం పై కేంద్ర‌ప్ర‌భుత్వం చ‌ర్చ‌కు సిద్ద‌మైన విష‌యం తెలిసిందే. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కొంత స‌మ‌యం కేటాయించారు స్పీక‌ర్. ఈసంద‌ర్భంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోడీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ఇద్ద‌రు భిన్న‌మైన వ్యక్తుల‌న్నారు. నోట్ల ర‌ద్దు విష‌యం ఎటువంటి ఆలోచ‌న లేకుండా చేశార‌ని మండిప‌డ్డారు.

rahul-gandhi

అధికారం పోతుందన్న భయంతో.. ఇద్దరూ ఆగ్రహంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక రాహుల్ గాంధీ త‌న ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత ప్ర‌ధాని నరేంద్ర‌మోదీని కౌగిలించుకున్నారు. రాహుల్ స‌డ‌న్ గా మోదీని కౌగిలించుకొగానే స‌భ‌లో ఉన్న స‌భ్యులంద‌రూ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ఈసంద‌ర్భంగా రాహుల్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ మండిప‌డ్డారు. స‌భ‌లో స‌భ్యులంతా సాంప్రదాయాలు పాటించాల‌న్నారు.

rahul gandhi, modi

ఆయ‌నను కౌగించుకోవ‌డానికి న‌రేంద్ర‌మోదీ కాద‌ని ప్ర‌ధానమంత్రి అన్నారు. బ‌య‌ట ఏం చేసినా త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని స‌భ‌లో హుందాగా న‌డుచుకోవాలన్నారు. ప్ర‌ధాని స్ధానంలో ఎవ‌రున్నా.. ఆస్ధానాన్ని గౌర‌వించాల‌న్నారు. రాహుల్ మోదీని కౌగించుకున్న స‌మ‌యంలో స‌భ‌లో ఏం జ‌రుగుతుందో త‌న‌కు అర్ధం కాలేద‌న్నారు. త‌న‌కు రాహుల్ పై వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి కోపం లేద‌ని ఒక అమ్మ‌లాగా చెబుతున్నాన‌న్నారు. ఇక రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోడీని ఆలీంగ‌నం చేసుకున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

- Advertisement -