కేటీఆర్ బర్త్ డే…విషెస్ తెలిపిన స్పీకర్ పోచారం,జగదీష్ రెడ్డి

254
jagadish reddy
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న కేటిఆర్ నేటి యువతకు ఆదర్శమని తెలిపారు.

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సూర్యాపేట జిల్లా బాల కేంద్రంలో మొక్కలు నాటారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ,కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,వై.వెంకటేశ్వర్లు ,మున్సిపల్ చైర్మన్ పెరుమళ్ళ అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్ తదితులు పాల్గొన్నారు.

కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ ,ఆమన్గల్ ,వెల్దండ.,మండల కేంద్రాలలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కేక్ కట్ చేసి మొక్కలు నాటి పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

- Advertisement -