వానాకాలం సాగుకు సమాయత్తం కండి: పోచారం

20
speaker

హైదరాబాద్ బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి వీడియో కాల్ లైవ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ…కరోనా పరిస్థితుల నేపధ్యంలో జరుగుతున్న లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ గారు సమీక్షించారు. లాక్ డౌన్ తో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చు, అందుకే ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.

వానాకాలం మొదలైనందున పంటల సాగుకు సమాయత్తం కావాలని సూచించారు. వానాకాలం పంటను జూన్ నెలలో నాట్లు వేయడం ద్వారా నవంబర్ నెలలో వచ్చు తుఫానుల నుండి తప్పించుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ దిశలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను అవసరమైన మేరకు ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు.

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై స్పీకర్ వివరాలను తెలుసుకున్నారు. లబ్దిదారులకు అవసరమైన సామాగ్రిని అందజేయాలని, త్వరితంగా నిర్మాణాలు పూర్తి అయ్యేవిదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదేవిదంగా గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకుని తగు సూచనలను చేశారు. సమావేశానికి ముందు ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీర్కూర్ మండలం దామరంచ సర్పంచ్ అల్లం అంబయ్య మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.