ఆరోగ్యమైన జీవనానికి పరిశుభ్రత ముఖ్యం: పోచారం

211
- Advertisement -

సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు” కార్యక్రమంలో ఈరోజు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ ఇందులో భాగంగా స్పీకర్ తన అధికారిక నివాసంలోని పూల కుండీలలో చెత్తను తొలగించి తాజా నీటితో నింపారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. మానవుల ఆరోగ్యవంతమైన జీవనానికి పచ్చదనం, పరిశుభ్రత అత్యంత ప్రాముఖ్యమైనవి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటితో పాటుగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత తోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కే టి రామారావుకి నా అభినందనలు అన్నారు.

Speaker pocharam participates cleanliness drive

పరిశుభ్రంగా ఉంటే సీజన్ లలో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.ఇదొక మంచి అవకాశం, పట్టణాలు, నగరాలలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తమ ఆరోగ్యం కోసం వారంలో పది నిమిషాలు కెటాయించడం పెద్ద ఇబ్బంది కాదు. జబ్బులు వచ్చిన తరువాత లక్షలు ఖర్చు చేయడం కన్నా ముందస్తు శుభ్రతతో నివారించవచ్చు. దీన్నొక సామాజిక కార్యక్రమంగా అందరూ భావించి ప్రతి ఆదివారం ఖచ్చితంగా పాటించాలని విజ్షప్తి చేస్తున్నాను అని స్పీకర్‌ పోచారం తెలిపారు.

- Advertisement -